కధ:- కృష్ణదాస్ (విశ్వక్సేన్) ఒక అనాథ. చిన్నప్నట్నుంచి తనతో కలిసి పెరిగిన ఇద్దరు స్నేహితులతో కలిసి అతను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. కృష్ణదాస్ ఆ హోటల్లోనే అనుకోకుండా కీర్తి (నివేథా పెతురాజ్) అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. కృష్ణ ఆమెతో ప్రేమలో పడిపోతాడు .. అతను ఒక డబ్బున్న వాడిలా నటిస్తూ ఆమెను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. కొన్ని రోజులకు కీర్తి కూడా కృష్ణ ప్రేమలో పడుతుంది. అప్పుడే కృష్ణ గురించి అసలు నిజం తెలుసుకున్న కీర్తి అతణ్ని అసహ్యించుకుని వెళ్లిపోతుంది. అలాగే మరో పక్క ఎస్ ఆర్ ఫార్మా చైర్మన్ గా డాక్టర్ సంజయ్ రుద్ర(మరో విశ్వక్ సేన్) తన ప్రయోగంతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని స్ట్రాంగ్ గా ఉంటాడు. అసల వాళ్ల ఇద్దరికి లింకు ఉందా.. ఉంటే అది ఏంటి .... వాళ్ళు ఇద్దరు కలుస్తారా.. అనేది సినిమా చూస్తే మనకి అర్ధమవుతుంది.
ప్లస్ పాయింట్స్ :- ఈ సినిమా లో ప్లస్ పాయింట్స్ కి వస్తే మెయిన్ గా విశ్వక సేన్ గారి డ్యుయల్ కారెక్టర్లు చాలా బాగా నటించాడు, మరియు సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా ప్రెసెంటబల్ గా ఉంటుంది. కృష్ణ పాత్రలో అమాయకంగా కనిపిస్తూ, సంజయ్ పాత్రలో చాలా సెటిల్డ్ గా చేశారు. అలాగే రెండు షేడ్స్ లో కూడా మంచి వేరియేషన్స్ ని ఎమోషన్స్ ని బాగా చేసాడు. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ ల పలు కామెడీ సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. నివేథా పెతురాజ్ కూడా వేరియేషన్ ఉన్న, పెర్ఫామెన్స్ ఓకే.
మైనస్ పాయింట్స్:- మనం గతంలో చూసిన డ్యూయల్ రోల్ రొటీన్ కాన్సెప్ట్ లో సినిమా కనిపిస్తుంది. ఇది కమర్షియల్ మూవీ లానే ఉంటది. సెకండాఫ్ చాలా కన్ఫ్యూజన్ కూడా నెలకొంటుంది,మరియు కొంచెం అంతా హైప్ అనిపించదు. ట్విస్ట్ లు ఉన్నాయి కానీ కొన్ని అంతగా పండలేదు. ఒక సాంగ్ అయితే కావాలని అది ఫారిన్ లో ఘాట్ చేశారు, కానీ ఆ సాంగ్ కి అంతా పెట్టాల్సిన అవసరం లేదు.
టెక్నికల్ పాయింట్స్:- లియోన్ జేమ్స్ మ్యూజిక్, సాంగ్స్ చాలా క్యాచీ సాంగ్స్ ఇచ్చారు. దినేష్ బాబు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా కమర్షియల్ మూవీ కి తగట్టు ఉన్నాయి. అసల కథ బాలేదని చెప్పలేం. అలా అని బాగుందనీ అనలేం. విశ్వకసేన్ ఏ డైరెక్టర్ కూడా అయేసరికి సెకండాఫ్ ని ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది.
కథాంశం :- ఇది ఎప్పటిలానే కమర్షియల్ సినిమా అయిన కృష్ణదాస్