వాల్టైర్ వీరయ్య

Ratings: 0.5/5
  Jan 13, 2023
   85 Views
విశ్లేషణ:

           ఇటివలే కె. ఎస్. రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన వాల్టైర్ వీరయ్య చిత్రం విడుదలైంది.ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్స్ కి పండగే పండగ. ఈసారి ఫ్యాన్స్ కి పండగ బాస్ సినిమాతో మొదలైంది. 'ప్రతి సారి సంక్రాంతి కి అల్లుడు వస్తాడు ఈసారి మొగుడు వచ్చాడు' అనే డైలాగ్ కి తగ్గటు చిరంజీవి గారి సినిమా ఉంది అని చెప్పుకోవడం లో తప్పు లేదు. చిరంజీవి గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన  అవసరంలేదు కానీ ఈ సినిమాలో అతని కామెడీ టైమింగ్ గురించి చెప్పుకోకుండా ఉండలేము . చిరంజీవి వెన్నెల కిషోర్ గారి జోడీ థియేటర్లలో  జనాలను ఎంతగానో అలరించింది. మొదటి సగం చిరంజీవి గారి భుజాల పైన నడిపిస్తే రెండో సగం రవి తేజ గారు నడిపించారు అని చెప్పుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ గారి పునకాలు లోడింగ్ విడుదల కి ముందే ఎంత సందడి చేసిందో అంతకు మించి థియేటర్లలో సందడి చేసింది. మొత్తం మీద చిరంజీవి గారి కాతలో మరో హిట్ పడింది అని చెప్పుకోవచ్చు. ప్రతి సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా విడుదల మాత్రం పక్కా.కుటుంబం అంతా కలిసి వెళ్ళి చూసే సినిమా ఇది.