పవన్ కళ్యాణ్ '' తొలి ప్రేమ '' మూవీ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోల పుట్టినరోజులు స్పెషల్ షోస్ గా వేసుకునే క్రమం లో ప్రారంభమైన ఈ రీ రిలీజ్ ట్రెండ్, ఇప్పుడు ఒక బిజినెస్ మోడల్ గా మారిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చెయ్యడానికి ఎగబడుతున్నారు.

రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక రికార్డ్స్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హీరో గా నటించిన జల్సా మరియు ఖుషి చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ ని సృష్టించాయి. జల్సా చిత్రం కేవలం ఒక్క రోజే ప్రదర్శించగా, ఆ మూవీకి మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఖుషి చిత్రానికి మొదటి రోజు 4 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఫుల్ రన్ లో 7 కోట్ల 80 లక్షలు వచ్చాయి.

ఈ రికార్డుని కొల్లగొట్టడానికి చాలా రీ రిలీజ్ లు వచ్చాయి, రీసెంట్ గా విడుదలైన సింహాద్రి సినిమా కూడా కలెక్షన్స్ అందుకోవడంలో విఫలం అయ్యింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి మరోసారి పవన్ కళ్యాణ్ రంగం లో దిగబోతున్నాడు. ఆయన హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ చిత్రాన్ని 4K టెక్నాలజీ తో మార్చి,జూన్ 30 వ తారీఖున రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చెయ్యబోతున్న శ్రీ మాట క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది.

మరి ఈ చిత్రం ఖుషి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించి, అనేక సార్లు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన వసూళ్ళను సాధించింది.మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నారా లేదా అనేది తెలియాలంటే వచ్చే నెల వరకు వేచి చూడాలి.

 

 

                                                                                     -తను✍️