భళా అనిపిస్తున్న ఉస్తాద్ ఫ్యాన్స్...

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధం అవుతుంది.

ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ తమ టాలెంట్ కు పదును పెడుతున్నారు . పవన్ ఫోటోలతో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పోస్టర్ అంటూ ఎడిట్ లు చేస్తున్నారు, నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ల కంటే ఫ్యాన్స్ ఎడిట్ చేసిన పోస్టర్లే,అద్భుతంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక తాజగా ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మే 11 న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ఒక అభిమాని ఎడిట్ చేసిన పోస్టర్ చూస్తుంటే మతి పోతుంది. పవన్ కళ్యాణ్ మాస్ లుక్ ను అద్భుతంగా డిజైన్ చేశారు.సడన్ గా ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ కంగారుపడి, ఇది నిజమే అనుకుని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అకౌంట్ ను చెక్ చేసేస్తున్నాం అని తెలిపారు. అందులో లేకపోవడంతో ఇది ఫ్యాన్స్ ఎడిట్ అని అర్ధమవుతుంది. ఏది ఏమైనా ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయిందని ఫ్యాన్స్ చెప్తున్నారు.

 

 

 

                                                                                     -తను✍