NTR30 మూవీ షూటింగ్ అప్డేట్...

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ NTR30.ఈ మూవీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు.RRR తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.గతంలో ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ని అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పనిచేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ని డీఓపీ రత్నవేలు తెలియజేశాడు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఎన్టీఆర్ పై పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ యాక్టింగ్ అద్భుతం అంటూ ప్రశంసించారు. కాగా ఇదే షెడ్యూల్ లో,విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే మూవీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది.

 

    

                                                                                  -తను✍