ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్... 'NTR30' ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్ అభిమానులకు ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తున్నారు యంగ్ టైగర్ బర్త్ డే కోసం.డైరెక్టర్ కొరటాల శివ చెప్పినట్టే ఫ్యాన్స్ కి గిఫ్ట్ అందించాడు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా, ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని కూడా రివీల్ చేశారు కొరటాల శివ.

గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు 'దేవర' అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఎన్టీఆర్ 30కి దేవర టైటిల్ ను ఫిక్స్ చేస్తూ,అధికారికంగా అనౌన్స్ చేసేశారు.

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అయితే తారక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సముద్రం మధ్యలో చేతిలో ఈటెతో సీరియస్ లుక్ లో తారక్ కనిపిస్తున్నాడు. బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీ పై కండువా చేతిలో రక్తంతో తడిచిన ఈటె ఉంది. శవాల మధ్య దేవరగా రౌద్రంగా చూస్తున్న ఎన్టీఆర్ లుక్ అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ని పక్క మాస్ లుక్ లో చూపించాడు శివ.

ఫస్ట్ లుక్ చూస్తుంటే ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారో,అందుకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ,తన హీరోని ప్రెజెంట్ చేశాడు. RRR మూవీ తర్వాత, ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో కేవలం టాలీవుడ్ లోనే కాదు దేవర మూవీ పై అన్ని ఇండస్ట్రీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దేవర ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసిన ఫ్యాన్స్ తమ ఆకలి తీరడం ఖాయమని ఫిక్స్ అయ్యారు.

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై తారక్ ఫ్యాన్స్ రెండింతల అంచనాలతో ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇందులో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

 

                                                                                  -తను✍️