కధ:- ఈ చిత్రం కధ ఒక మారుమూల సింగరేణి బొగ్గుగని ప్రాంతంలోని వీర్లపల్లి అనే పల్లెటూరు లో ధరణి(Nani) తన ఊరు అక్కడ వాళ్ల పరిస్థితుల గురించి చెప్పడం తో మనకి సినిమా మొదలవతుంది. ఆ ఊరిలో దాదాపు మగవారు అంతా మందుకి బానిసలైపోతారు. ధరణి, సూరి(Dheekshit Sheety) ఇద్దరు చిన్నపట్టి నుంచి ప్రాణ స్నేహితులు, వీరితో మరొక 6 గురు ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళంతా ఏ పని చేయకుండా వాళ్ల ఊరి నుంచి వెళ్ళే గూడ్స్ ట్రైన్ లో నుంచి బొగ్గు గనులను దొంగతనం చేసేవారు. వీరికి వెన్నెల(Keerthy Suresh) చిన్ననాటి స్నేహితురాలు, వెన్నెల అదే ఊరిలో అంగన్వాడీ టీచర్ లాగా పనిచేస్తుంది. సూరి, వెన్నల చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. రాజన్న (సాయికుమార్), శివన్న (సముతిరకని) మరియు అతని కొడుకు చిన్న నంబి (షైన్ టామ్ చాకో) మధ్య స్థానిక రాజకీయాలు వాళ్ల అక్కడ రాజకీయ పరిస్తితులు ఎలా మారతాయి, అవి ఆ గ్రామస్తుల జీవితాలని మార్చరా లేదా.. అసల సూరి చనిపోవడానికి కారణం ఏంటి.. సూరి చనిపోయే సమయానికి ధరణి ఎక్కడ, ఏంచేస్తున్నాడు అన్నది మనకి సినిమా చూస్తే అర్ధమవుతుంది.
ప్లస్ పాయింట్స్ :- ఈ సినిమా లో ప్లస్ పాయింట్స్ కి వస్తే మెయిన్ గా నాని గారి కారెక్టర్, తన యాక్టింగ్ పర్ఫార్మన్స్. నాని గారు ఒక టెర్రిఫిక్ పెరఫవర్మర్ అయిన ఏ కారెక్టర్ చేసిన చాలా ఈజ్ గా చేస్తారు అండ్ ఈసారి కొత్తగా ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ మాస్ హీరో రోల్ ప్లే చేశారు. ధరణి కారెక్టర్ చాలా raw అండ్ Rustic గా ఉన్నా నాని గారు చాలా బాగా నటించారు. అసల ఎమోషనల్ scenes, పచ్చి తాగుబోతులా చాలా సహజంగా కనిపించారు. కీర్తి సురేష్ యాక్టింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ సహజం గా చేశారు. దీక్షిత్ శెట్టి పర్ఫార్మన్స్ కూడా చాలా బాగా చేశాడు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పర్ఫార్మెన్స్ సెటిల్డ్ గా చాలా బాగా చేశారు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారు ఒక సాధారణ రివెంజ్ డ్రామానే, తీసిన ఇది ప్లాట్ కంటే విజువల్ స్టైల్ మరియు గ్రాండ్ మేకింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, నాని పాత్రలోని షేడ్స్ ను, చాలా క్లియర్ గా మనకి చూపించారు.
మైనస్ పాయింట్స్:- డైరెక్టర్ సెకండాఫ్ ని మరీ స్లోగా చూపించారు. కొంచెం ఎడిటింగ్ క్రిస్ప్ గా చేసి ఉంటే బాగుండెది. ఇది ఒక రొటీన్ స్టోరీ లాగా కొన్ని సీన్లను గెస్స్ చేయగలం.
టెక్నికల్ పాయింట్స్:- ఇందులో చెపుకోదగిన వర్క్ అయితే సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ గారిది. అయిన విసుయల్స్ అయితే అగ్రశ్రేణి. సినిమా పూర్తిగా బొగ్గు గని నేపథ్యంలో సాగడం వల్ల విసుయల్స్ ఎంతో రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. మేకప్ ఆర్టిస్ట్స్ గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళు చేసిన వర్క్ చాలా బాగుంది.
కథాంశం :- ఇది ఎప్పటిలానే రివెంజ్ యాక్షన్ డ్రామా, నటుల పర్ఫార్మన్స్ తో వెళ్ళిపోయింది.