Jana Gana Mana Movie review

Ratings: 0.5/5
  Jun 02, 2022
   64 Views
విశ్లేషణ:

      

అసలు ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ రియాలిటీకి దూరంగా ఊహాగాణానికి దగ్గరగా ఉంటున్నాయి. కాని మలయాళం సినిమాలు మాత్రం రియాలిటీకి దగ్గరలో మరియు రియల్ ఇన్సిడెంట్స్ కి రిలేటెడ్ గా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తీసుకొస్తున్నారు.  

          జన గణ మన సినిమా అనే సినిమా కథ.... ఒక యూనివర్సిటీ లెక్చరర్ అయిన సభా మరియం (మమతా మోహన్ దాస్)ను రేప్ చేసి, బాడీని కాల్చి చంపేశారంటూ మీడియాలో నేషనల్ హెడ్డింగ్ అవుతుంది. ఇక యూనివర్సిటీ స్టూడెంట్స్ తమ టీచర్‌కు న్యాయం జరగాలని రోడ్డు మీదకు ఎక్కుతారు. సభా మరియం తల్లి సైతం న్యాయం కోసం పోరాడుతుంది. ఇక ఈ కేసును  ఏసీపీ సజ్జన్(సూరజ్ వెంజనమూడు) చేతుల్లోకి వెళ్తుంది, ఇక రంగంలోకి దిగుతాడు. ఓ నలుగురు క్రిమినల్స్ ని  పట్టుకుంటాడు. సొసైటి మొత్తం వారిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తుంది. పై నుంచి ఒత్తిళ్లు రావడంతో ఏసీపీ కూడా ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేయాలని డిసైడ్ అవుతారు. దీనిపై మానవ హక్కుల కమీషన్ ఆగ్రహిస్తుంది. న్యాయ స్థానంలో కనీసం ఆ నిందితులను ప్రవేశ పెట్టకుండా అలా ఎలా చేస్తారంటూ డిఫెన్సు న్యాయవాది అయిన అరవింద్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) కేసు వాదిస్తాడు. ఏసీపీ సజ్జన్ చేసిన ఎన్ కౌంటర్‌కు వ్యతిరేకంగా నిలబడతాడు అరవింద్. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? అసలు ఆ ఎన్ కౌంటర్ ఎందుకు చేశారు? సభా మరియం ఎలా చనిపోయింది? ఆమె చావుకు గల కారణం ఏంటి? దాని వెనుకున్నది ఎవరు? అనే విషయాలు ఎలా బయటకు వచ్చాయి?  ఇదంతా మనకి సినిమా చూస్తే సమాధానాలు దొరుకుతాయి. 

    ఈ సినిమా "Law and Justice are not always the Same" ఈ ఒక్క డైలాగ్ సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. అసలు ఈ సినిమాలోని సన్నివేశాలని రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్ గా తీశారు. ఈ సినిమా మొత్తం వ్యవస్థను  ప్రశ్నించడమే దర్శకుడు మనకి చూపిస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు మనకు చాలా సంఘటనలే గుర్తుకు వస్తాయి. సమాజంలోని అన్ని వ్యవస్థలను ఒక రాజకీయ వ్యవస్థ మాత్రం మనల్ని రూల్ చేస్తున్నాయి, అవి  విద్యా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇలా అన్నింటి మీద ప్రశ్నలు ప్రశ్నింపజేశాడు. సమాజంలో ఇవి ఎలాంటి స్థితిలో ఉన్నాయో చూపించాడు. ప్రభుత్వం తమ ఇమేజ్ ను పెంపొందించుకోవడానికి పరిస్థితులను ఎలా ఉపయోగించుకుంటున్నారు, దానికి విద్యార్థులను ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ విషయాలను ఈ సినిమా మనకి చూపిస్తుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది. రంగు, రూపం, వేషధారణ బట్టి కూడా చేస్తారా? అంటూ ఈ సమాజానికి కనువిప్పు కలిగేలా ప్రశ్నలు సంధించాడు. అసలు రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారు.. ఓట్ల రాజకీయం ఎలా ఉంటుందో చూపించాడు.

        ఇందులో "నిజాన్ని కాపాడటానికి మీడియా ఉందా, లేదా మీడియా చెప్పేదే నిజమా" ఈ ఒక్క డైలాగ్ కి మన నిజజీవితంలో జరిగే సన్నివేశాలే మనకి నిరూపిస్తుంది. ఇలాగే "ఇన్స్టిట్యూషనల్ సూసైడ్"(Institutional Suicides) మన IIT, IIIT, లో స్టూడెంట్స్ సూసైడ్ వాళ్ల సమస్యలు కూడా మనకి చూపిస్తారు. మనం చూసేది నిజమా లేక వాళ్ళు చూపిస్తుంది మనం నమ్ముతున్నామా అన్నది మనకి మనం ప్రశ్నించుకోవాలి.  
     ఈ సినిమాని ప్రత్యేకంగా అందరు చూడాలి, ఇందులో చూపించిన ప్రతి ఒక సంఘటనతో దర్శకుడు  వాస్తవ సంఘటనలని మనకి చూపించారు. మన చుట్టుపక్కల ఇన్ని జరుగుతున్నాయా అనేది మనకి కళ్ళకి కట్టినట్టు అర్థం అవుతుంది.

ఇక  సినిమా విషయానికి వస్తే కనిపించేవి ఎన్ని పాత్రలున్నా కూడా మన దృష్టి మాత్రం ఫస్ట్  హాఫ్‌లో ఏసీపీ సజ్జన్ మీదే ఉంటుంది. ఇక రెండవ సగం  మొత్తం కూడా పృథ్వీరాజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. నటనలో ఈ ఇద్దరు పోటా పోటీగా చేసారు. సభా మరియం పాత్రలో మమతా మోహన్ దాస్ చక్కగా నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.
     ఇలాంటి పాయింట్ ను తీసుకొని తెరపైకి తీసుకొచ్చిన దర్శక రచయిత డిజో జోస్ ఆంటోని ని మెచ్చుకొని తీరాల్సిందే. కోర్టు సన్నివేశాలు - సినిమాలోని డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో మనకి అందుబాటులో ఉంది.