రన్ బేబీ రన్ అనేది ఒక థ్రిల్లర్ కథ, ఇది ఫస్ట్ తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం హాట్‌స్టార్ డిస్నీలో చూడొచ్చు. ఇంక కథ లోకి వస్తే ఒక మెడికల్ కాలేజీ లో సోఫీ అనే విద్యార్థిని బిల్డింగ్ పైన నుండి కిందకి దూకి చనిపోతుంది. మరల కథ ఒక 7 రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది, అక్కడ ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్న సత్య అనే బ్యాంకర్ నగల దుకాణానికి వెళ్ళి తన కాబోయే భార్య కోసం గిఫ్ట్ గా సత్య ఆమెకు ఒక జత చెవిపోగులు కొంటాడు. వాటిని తీసుకున్న వెంటానే, అతను తన భార్య దగ్గరకి కార్ లో వెళ్లి తనని ఎక్కించుకొని తను కొన్న చెవిపోగులు ఇస్తాడు. అప్పుడే అతను తన కారు వెనుక సీట్లో దాక్కున్న మరో అమ్మాయిని అకస్మాత్తుగా చూస్తాడు.
సత్య ఆ పరిస్థితి లో తన కారులో దాక్కున్న అమ్మాయీ ఎవరో అర్దం కావటం లేదు, కారులో ఉన్నా తన భార్యకి తెలిస్తే ప్రమదం అని, తనకి సందేహం రాకుండా తన భార్యా కి ఎదో ఒక పని ఉంది అని అక్కడనుంచి తనని వదిలి వెళ్ళిపోతాడు .అదే సమయంలో, తన కారును ఆపి, ఆ అమ్మాయి ని ప్రశ్నించగా, తను ఒక వైద్య కళాశాల విద్యార్థిని తార అని, తన ప్రాణాలకు ముప్పు ఉందని, నేను ఇప్పుడు ఉన్నా పరిస్థితి కి ఎం చెప్పలేను అని సూర్య తో చెప్తుంది. ఒక గంట లేదా రెండు గంటల్లో తన సంరక్షకుడు వచ్చి తనను తీసుకువెళ్లే వరకు తన ఫ్లాట్‌లో ఉండటానికి అనుమతించమని ఆమె అతన్ని వేడుకుంటుంది. సత్య మొదట నిరాకరిస్తాడు మరియు ఆమెను బయటకు పంపడానికి చాలామొండిగా ఉంటాడు. కానీ చివరికి, అతను ఆమె ఉన్న పరిస్థితికి చలించిపోయి, అతను ఆమెను అతిథి గదిలోకి అనుమతిస్తాడు. ఆమె తన సంరక్షకుడితో వెళ్లినప్పుడు తనకు తెలియజేయవలసిన అవసరం లేదని ఆమెకు చెప్తాడు. అయితే, అది ఒక భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఆ దారుణమైన పరిస్థితి లో అసలు ఆ తార ఎందుకు ఉంది, సత్య రూమ్ లో ఏమైంది, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని సత్య సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది మనం సినిమా చూస్తే అర్దం అవుతుంది.
ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే ఈ కథకి సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు, దాని వల్ల సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది విజువల్స్ చాలా మంచిగా అనిపించాయి. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంటర్స్టింగ్ గా స్టోరీ ని చూపించాడు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ మనకి క్రియేట్ చేసాడు.
ప్లస్ పాయింట్లు:- ఆర్జే బాలాజీ గారు చాలా ప్రశాంతంగా తన క్యారెక్టర్ కి తగ్గట్టు బాగా యాక్ట్ చేసారు. ఐశ్వర్య రాజేష్ కూడా తన స్క్రీన్ టైమ్ లో బాగా యాక్ట్ చేసింది. ఈ కథకి సంగీతం ఒక పెద్ద ప్లస్. ఇంక డైరెక్టర్ అయితే తను కథ చెప్పిన విధానం బాగుంది, దాని వల్ల కథ కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్లు:- ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్లినా సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసారు అనిపిస్తోంది. లాస్ట్ క్లైమాక్స్ ని మాత్రం సాధారణంగానే ఎండ్ చేసారు, ఆ క్లైమాక్స్ బిట్ లో కొంచెం విలన్ అసలు ఎందుకు ఇది అంత చేసాడు అనేది క్లారిటీ గా చూపించి ఉంటే బాగుండేది.
కథాంశం:- అసాధారణ పరిస్థితిలో చిక్కుకున్న సామాన్యుడు ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడ్డాడు.