బలగం

Ratings: 0.5/5
  Mar 03, 2023
   47 Views
విశ్లేషణ:

మనం చిన్నప్పటినుండి సినిమాలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ప్రతి ఒక్క సీన్స్ ని  చాలా సహజంగా మరియు అందంగా అక్కడ జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని స్వచ్ఛంగా చూపిస్తారు. అక్కడ  ఉండే మనుషులు ఎలా స్వచ్ఛం గా కలిసిమెలిసి అందరిని మన అని అనుకొని ఉంటారో, మళ్ళీ ఏ ఒక్కరికి కష్టం వచ్చిన అందరు కలిసి వాళ్లకి తోడుగా ఎలా ఉంటారో అలాంటివి చాలా సినిమాల్లో చూశాము.ఇలా ఈసారి మనకి ఆ పల్లెటూరి కథతో వేణు యెల్లండి గారు  బలగం అనే సినిమాతో మన ముందుకొచ్చారు. ఈ సినిమా మనకి తెలంగాణ రాష్ట్రం లో ఒక మారుమూల పల్లెలో ఏం జరుగుతుంది వాళ్ళు ఉండే  విధానంనీ చాలా చక్కగా మనకి మంచి ఎమోషన్స్ తో చూపించారు. ఇంత వరకు మనకి  తెలంగాణ లో వాళ్ల సంస్కృతిని చూపిస్తూ అక్కడ మనుషుల విధివిధానాన్ని  పూర్తిగా ఎక్కడ  చూపించలేదు కానీ ఈ సినిమా మొత్తం ఆ నేపధ్యంలోనే నడుస్తుంది. అసలు తెలంగాణ యాస‌ అర్ధం అయ్యే వాళ్ళు అయితే సినిమా ని బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు కొన్ని మాటలు అర్దం కాకపోయిన అక్కడ వాళ్ళు చేసే నటన ని చూస్తే సీన్ అర్ధం అయింది.  ఇప్పుడిప్పుడే తెలంగాణ సంస్కృతి మీద   వాళ్ళు ఉండే విధానం మీద  వాళ్ళ కట్టుబాట్ల  మీద సినిమాలు వస్తున్నాయి. ఇంకా సినిమా అయితే ఒక చిన్న లైన్ మీద వెళ్ళిన అక్కడ ఉండే ఎమోషన్స్ మరియు డ్రామా ని మనకి చక్కగా చూపించారు. ఈ సినిమా లో మనకి కామెడీ, డ్రామా, ఫ్యామిలీ భావోద్వేగాలు, అక్కడ జరిగే పరిస్థితులు వాటినీ చక్కగా ఎమోషన్స్ తో చూపించారు. అసలు కథ ఏంటి అంటే    కొముర‌య్య (సుధాక‌ర్‌ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి) పెళ్ళికి రెడీ అవుతాడు. రెండు రోజుల్లో వరపూజ (నిశ్చితార్థం) అనగా… అతని తాతయ్య కొముర‌య్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. అప్పటికే సాయిలు (ప్రియ‌ద‌ర్శి) అప్పులు చేసి వ్యాపారాలు పెడతాడు. వరపూజ రోజున పది లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామని ఆశ పడిన సాయిలుకి నిరాశే మిగులుతుంది. చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది.  మరి సాయిలు అప్పు ని తీరుస్తాడా లేదా అన్నది సినిమా చూస్తే మనకి అర్దం అయ్యిది. కొమురయ్య చావు చుట్టూ జరిగే సన్నివేశాలు కూడా చాలా చక్కగా ఎమోషన్స్ తో చూపించారు.

          ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే సంగీతం మరియు పాటలు అయితే ఈ సినిమాకి ప్రాణం పోసాయి. ప్రతి ఒక్క పాట అక్కడ జరిగే పరిస్థితి ని మనకి పాట ద్వారా తెలియజెప్పారు. చివరి క్లైమాక్స్ లో వచ్చే పాట అయితే అది అక్కడ ఆ ఫ్యామిలీ గురించి కుటుంబ అనుబంధాల గురించి చాలా బాగా చూపించారు. సంగీతం కంపోజ్ చేసింది భీమ్స్ సిసరోలియా. ఇంక నటన గురించి అయితే చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరు చాలా సింపుల్ గా, ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా నేచురల్ గా చేసారు.

 

ప్లస్ పాయింట్లు:- ఇందులో  కథ ప్రారంభం నుండే ఏ సుత్తి లేకుండా పాయింట్ లోకి వచ్చేయడం, ప్రతి ఒకరి పాత్రని చక్కగా చూపించడం, మరియు కథలో ఉన్న ఇంటెన్సిటీ, భావోద్వేగాలు ని నటుల  ద్వార చాలా బాగా లాస్ట్ దాకా తీసుకువెళ్లారు అనే చెప్పొచ్చు. ఇదీ ఒక కుటుంబ విలువలు గురించి, అందరు కలిసి మెలిసి ఉండాలనే నేపధ్యంలో జరిగే కథ. ప్రతి ఒక క్యారెక్టర్ చేసిన యాక్టర్స్  చాలా బాగా వారి క్యారెక్టర్ కి తగ్గటు  చేసారు. ఈ సినిమా మొత్తంలో లాస్ట్ లో ఉండే ఆ క్లైమాక్స్ సాంగ్ కి అందరం చాలా ఎమోషనల్ అవుతాము ఎందుకంటె అలాంటి పరిస్థితులు మన ప్రతీఒక్కరి కుటుంబాలలో  జరిగేవి, అందువల్ల దానికి అందరం కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అవుతాము.

మైనస్ పాయింట్లు:- మైనస్ అంటూ ఏమి లేకపోయినా ఇంటర్వెల్ తర్వాత చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా సినిమా మొత్తం మంచిగా ఒక తెలంగాణ పల్లెలో మనం ఉన్నట్లే ఉంటుంది.

 కథాంశం:- ఇందులో కుటుంబం గురించి కుటుంబంలో అందరు కలసిమెలసి ఉండి ఎన్ని కష్టాలు వచ్చిన విడిపోకుండా ఉండాలి అనేది చక్కగా చెప్తారు.