Shah Rukh Khan: ఆ స్టార్ హీరో కారణంగా షారుక్ ఖాన్ సినిమా ఆలస్యం కానుందా..

రీసెంట్ గా పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. చాలా కాలం తర్వాత పఠాన్ సినిమాతో హిట్ కొట్టారు షారుక్. ఈ సినిమా బాహుబలి రికార్డును దాటేసింది.. ఎలాగో అలా..! బాహుబలి రికార్డును బద్దలు కొట్టారు షారుఖ్! అదే జోష్‌తో... మరో సినిమాను చేయాలనుకున్నారు. కానీ మన కోలీవుడ్ స్టార్ హీరో కారణంగా.. ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారట. ఇప్పుడిదే బీటౌన్‌లో హాట్ న్యూస్ అట. ఇంతకు ఆ కోలీవుడ్ హీరో ఎవరంటే..

పఠాన్‌తో.. ఆ సినిమా కమాయించిన కలెక్షన్స్‌తో.. బాలీవుడ్ నే షేక్ చేసిన షారుఖ్.. ఆ మేనియాను కంటిన్యూ చేయాలని అనుకున్నారు. వీలైనంత తొందరగా.. తన నెక్ట్స్ మూవీ.. అట్లీ డైరెక్షన్లో తెరకెక్కితున్న మూవీని రిలీజ్ చేసుందు ప్లాన్ చేశారు. జూన్ 2 నే జవాన్ రిలీజ్ అంటూ అఫీషియల్ గా డేట్ కూడా అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టే జవాన్ షూటింగ్‌ను కూడా పరిగెత్తిస్తున్నారు. కానీ ఈ క్రమంలోనే బీ టౌన్‌లో వైలర్ అవుతున్న ఓ హాట్ న్యూస్‌గా మారిపోయారు.

అకార్డింగ్ టూ బీ టౌన్ గాసిప్.. షారుఖ్ జవాన్‌ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్‌ ఉందట. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కారణంగా అట. హీరో విజయ్‌.. జవాన్‌ సినిమాలో ఓ కేమియో అప్పియరెన్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పారట. కానీ డేట్స్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. అయితే ఎట్ ప్రజెంట్ లియో షూటింగ్లో ఉన్న విజయ్ ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవగానే.. జవాన్‌ కోసం డేట్స్‌ అడ్జెస్ట్ చేయనున్నారట. ఇక ఈ కారణంతోనే.. ఈసినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్‌ ఉందని టాక్ వినిపిస్తోంది.