పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబోలో మల్ల మరో బ్లాక్ బస్టర్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్ ' కి షూటింగ్ స్టార్ట్ అయ్యింది . పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ వీరిద్దరి కాంబోలో ముందుగా వచ్చిన సినిమా 'గబ్బర్‌సింగ్' ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మరల అలాంటి మ్యాజిక్ నే మన ముందుకు తీసుకువస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ సినిమా 2022 డిసెంబర్ లోనే స్టార్ట్ అయ్యింది . కాని అసలు షూటింగ్ మాత్రం బుధవారం ప్రారంభం అయ్యింది . ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి మంగళవారం రాత్రి చేరుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి గారి చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ సెట్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ మెయిన్ షెడ్యూల్ అవ్వగా ప్రధాన పాత్రలు అందరితో కలిసినా పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ 'ఉస్తాద్ ఊచకోత షురూ' అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.