ఆ సందర్భంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అంటున్న సాయి పల్లవి... అసలేం జరిగింది??

హైదరాబాద్‌: చిన్నతనంలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి ‘నిజం’ (Nijam) వేదికగా బయటపెట్టారు నటి సాయిపల్లవి (Sai Pallavi). స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో పాల్గొన్న ఆమె.. తన స్కూల్‌ డేస్‌పై స్పందించారు. ‘‘చిన్నతనంలో నేనొక అల్లరి పిల్లను. క్లాసులు ఎగ్గొట్టి డ్యాన్స్‌ శిక్షణకు వెళ్లేదాన్ని. ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశాను. అప్పుడు నా జుట్టు చిన్నగా ఉండేది. జుట్టు పొడవుగా కనిపించడం కోసం అమ్మ.. ఓ చున్నీని నా తలకు కట్టింది. తీరా, డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు అది ఊడిపోయి కిందపడిపోయింది. ఆ క్షణం ఎందుకో బాగా ఇబ్బందిగా అనిపించి.. స్టేజ్‌ దిగిపోయి బాగా ఏడ్చేశాను. అమ్మ కూడా బాధపడింది’’ అని తెలిపారు