విక్టరీ వెంకటేష్ గారు ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన తరువాత ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో "సైంధవ్" అనే చిత్రంలో నటించబోతున్నారు అన్న విషయం అందరికి తెలిసిందే.
విశాఖ నగరంలో ఆదివారం సినీ హీరో వెంకటేష్‌గారు సందడి చేసారు. గత కొద్ది రోజులుగా ఉక్కు నగరంలో జరుగుతున్న "సైంధవ్" సినిమా చిత్రీకరణ భాగంగా పాల్గొన్న వెంకటేష్ గారు ఆదివారం బీచ్‌రోడ్డులోని రామానాయుడు స్టూడియోకు వచ్చారు.
స్టూడియోలో వివిధ నిర్మాణాలను పరిశీలించిన ఆయన, అప్పటికే వెంకటేష్ గారిని అక్కడ చూసి భారీగా చేరుకున్న అభిమానులతో, సందర్శకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కొంతమంది అభిమానులు వెంకటేష్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఆయన ఎవర్ని కాదు అనకుండా అందరికి ఎంతో ఆనందంతో ఫోటోలు(selfies) తీసుకోడానికి సమయాన్ని కేటాయించారు.
- తను✍️